CJI Justice BR Gavai : ఢిల్లీ – తెలంగాణ సర్కార్ కు కోలుకోలేని ఝలక్ ఇచ్చారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్. హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన భూముల వ్యవహారానికి సంబంధించిన కేసును విచారించారు జస్టిస్ బీఆర్ గవాయ్ (CJI Justice BR Gavai) నేతృత్వంలోని ధర్మాసనం. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనివర్శిటీకి సంబంధించి భూములను కాపాడటంలో మీరు విఫలం అయ్యారు. అంతే కాదు చెట్లను తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సర్కార్ పై సీరియస్ అయ్యారు. అడవులను కాపాడుతారా లేక మీ అధికారులను జైలుకు పంపించాలా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
CJI Justice BR Gavai Slams
HCU అడవులను ధ్వంసం చేయడంపై రేవంత్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు ప్రధాన న్యాయమూర్తి. వారాంతం సమయంలో రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించారు బీఆర్ గవాయ్. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదని స్పష్టం చేశారు. అడవులను సంరక్షించాలా? లేదా మీ అధికారులను జైలుకు పంపాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు బీఆర్ గవాయ్.
అడవుల్లో చెట్లను నరికించి, అది సుస్థిర అభివృద్ధి కోసమేనని చెప్పి సమర్థించు కోలేరని రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్.
Also Read : TTD Alarming – Mobiles Auction : శ్రీవారి భక్తులకై అందుబాటులోకి సెల్ ఫోన్లు..దక్కించుకోండి ఇలా!


















