Minister Anam : నంద్యాల జిల్లా – రాష్ట్రంలో ఆలయాల అభివృద్దిపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి (Minister Anam). నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం, దుర్వేసి గ్రామం లో సూపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమం లో పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పథకాలను చాలా మంది అవహేళన చేశారని, కాని ప్రజలు విశ్వసించారు గెలిపించారని అన్నారు. గత జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వేసి గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామంలో సుంకులమ్మ గుడి నిర్మిస్తామని ప్రకటించారు ఆనం రామ నారాయణ రెడ్డి.
Minister Anam Ramanarayana Reddy Comments
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూన్నామని చెప్పారు. గత ప్రభత్వంలో రైతుల పుస్తకాల పై జగన్ ఫోటో వేయించు కోవడం విడ్డూరంగా ఉందన్నారు. కోట్ల ఎకరాల రైతుల భూములను ప్రభుత్వ భూమి పేరుతో రుణం తీసుకోవాలని వైసిపి కుట్ర చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఆగస్టు15 నుంచి రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తూన్నామని వెల్లడించారు ఆనం రామ నారాయణ రెడ్డి. అడబిడ్డ నిధిని కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
అడబిడ్డలకు పెళ్ళి, ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వం అడబిడ్డ నిధితో అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
తప్పుడు హామీలు ఇవ్వడం తమ నాయకుడు చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉండదన్నారు. అలయాల్లో ధూప దీప నైవేద్యాలకు పూజారికి ప్రతినెల పది వేలు ఇవ్వనున్నామని వెల్లడించారు. జిల్లాలో47 అలయాలకు 43 కోట్లు కేటాయించామని చెప్పారు ఆనం రామ నారాయణ రెడ్డి. కాల్వబుగ్గకు నాలుగు కోట్లు మంజూరు చేశామన్నారు.
Also Read : Srinivas Goud Fired on BJP Chief : బీజేపీ బీసీ ద్రోహుల పార్టీ – శ్రీనివాసులు గౌడ్
















