Srinivas Goud : హైదరాబాద్ – బీజేపీ బీసీ ద్రోహుల పార్టీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud). రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావును ఏకి పారేశారు. తను పూర్తిగా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి అని, బీసీలంటే తనకు గిట్టదన్నారు. రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రామచంద్రరావుది అని ధ్వజమెత్తారు. అందుకే బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో విషం గక్కాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Ex Minister Srinivas Goud Slams BJP
బిజెపిలో కుట్రలు చేస్తూ బీసీలను ఒక్కొక్కరిని సాగనంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చమని చెప్పడం బీసీల విద్రోహ చర్య తప్ప మరోటి కాదన్నారు. బీసీ రిజర్వేషన్లపై రామచంద్రరావు 48 గంటల్లోగా తాను చేసిన కామెంట్స్ ను ఉప సంహరించు కోవాలని డిమాండ్ చేశారు. లేక పోతే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బిజెపి బీసీ వ్యతిరేక చర్యలు మానుకోకపోతే తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రావడం అసంభవం అన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్.
బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చడం కుదరదని ఢిల్లీలో చెప్పడం దారుణమన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచక పోతే బిజెపి బీసీల ద్రోహుల పార్టీగా చరిత్రలో నిలిచి పోతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అన్నారు.
Also Read : YS Sharmila Shocking Comments : మహాశక్తి పథకానికి ప్రభుత్వం మంగళం – షర్మిల
















