Indian Railways: తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఇటీవల భారత రైల్వే కొత్త నిబంధనలు అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ (IRCTC) ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరిగా విధించింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆధార్ ఆధారిత ఓటీపీ అథెంటికేషన్ విధానాన్ని సాంకేతిక సమస్యల కారణంగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రైల్వే అధికారులు స్పష్టంచేశారు.
Indian Railways Update
జూలై 1 నుంచి IRCTC వెబ్‌సైట్‌లో తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ అవసరమవుతుందని, జూలై 15 నుంచి రిజర్వేషన్ కౌంటర్లలో కూడా అదే విధానాన్ని అమలు చేస్తామని రైల్వే శాఖ (Indian Railways) ప్రకటించినప్పటికీ, ప్రస్తుతానికి ఆధార్ లేకుండానే టికెట్లను జారీ చేస్తున్నారు. ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక లోపాలు, టికెట్ జారీ ప్రక్రియలో జాప్యం ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) వెల్లడించింది.
టికెట్ జారీకి ఎక్కువ సమయం
ప్రస్తుతం ఒక నిమిషంలో నాలుగు టికెట్లను జారీ చేసే సౌలభ్యం ఉన్న రిజర్వేషన్ కౌంటర్లలో, ఆధార్ ఓటీపీని నమోదు చేసే ప్రక్రియలో ఒక్కో టికెట్‌కు కనీసం 52 సెకన్ల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. ఈ జాప్యం కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆధార్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
డిసెంబర్ నాటికి కొత్త పాస్‌వర్డ్ రిజర్వేషన్ సిస్టమ్
ఇక రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) పూర్తిగా ఆధునికీకరించేందుకు సిద్ధమవుతోంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ఆధ్వర్యంలో డిసెంబర్ 2025 నాటికి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
కొత్త సిస్టమ్‌తో ప్రతి నిమిషం 1.5 లక్షల టికెట్ల బుకింగ్ సామర్థ్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఇది నిమిషానికి 32,000 టికెట్లకు మాత్రమే పరిమితమైంది. అంతేకాక, ప్రస్తుత వ్యవస్థ నిమిషానికి 4 లక్షల సమాచార విచారణల్ని నిర్వహిస్తుంటే, కొత్త సాంకేతిక వ్యవస్థ నిమిషానికి 40 లక్షల విచారణలకు మద్దతు ఇస్తుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.
Also Read : Gold Price Sensational : మరోసారి ఆకాశాన్నంటిన పసిడి ధరలు



















