Minister Pemmasani : అమరావతి – కూటమి పాలన అభివృద్దికి నమూనాగా మారి పోయిందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని నంది వెలుగు బ్రిడ్జి పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 36.91కోట్లతో దీనిని నిర్మించారు. కూటమి నేతలు ప్రభుత్వ నికి ప్రజలకు మధ్య అనుసంధంగా మారి నగర అభివృద్ధి కోసం పోరాడుతూనే వున్నారని అన్నారు. 2014 నుంచి 2015 లో నంది వెలుగు బ్రిడ్జి నిర్మాణం మొదలు పెడితే 2019లో వైసీపీ 5 ఏళ్ల పాలనలో మూలన పడేసిన పరిస్థితి నెలకొందన్నారు. చాలా కష్టపడి దీనిని పునః నిర్మాణం కోసం అమలు పత్రాలు తెచ్చామన్నారు.
Minister Pemmasani Chandra Sekhar Comments
ఈ బ్రిడ్జి పూర్తి కాగానే దీనికి అబ్దుల్ కలాం పేరు పెడతామని ప్రజలకు హామీ ఇచ్చారు పెమ్మసాని (Minister Pemmasani). బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అబ్దుల్ కలాంని రాష్ట్రపతి పదవిలో కూర్చోపెట్టిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. గుంటూరు నగరానికి ఒక మణి హారంగా వుండే ఇన్నర్ రింగ్ రోడ్ కోసం రూ. 48 కోట్లతో టెండర్ కోసం పంపించామని స్పష్టం చేశారు.. రాష్ట్రలో సుపరిపాలనతో పాటు సూపర్ పాలన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దూసుకు పోతున్నాయని అన్నారు. గోరంట్ల త్రాగునీటి కోసం 300 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు.
భారత దేశంలో స్వచ్ఛ సర్వేక్షన్ ద్వారా నగరానికి స్వచ్ఛ భారత్ అవార్డ్ గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ దక్కడం గర్వంగా ఉందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో గంజాయి స్మగ్లింగ్ అలవాటుతో సర్వనాశనం చేశారని ఆరోపించారు, మరలా రప్పా రప్పా అంటూ ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మరొక్కసారి పర్యటనలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Also Read : Singireddy Niranjan Reddy Fired on CM : నియంత పోకడలు నికృష్టపు మాటలు


















