TG B Tech : హైదరాబాద్ – తెలంగాణ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఇంజనీరింగ్ అడ్మిషన్లు 2025 కు గాను బి – కేటగిరి కింద భర్తీ చేసే సీట్ల కేటాయింపునకు సంబంధించి జూలై 19 నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించింది. తెలంగాణ (Telangana) ఉన్నత విద్యా మండలి 2025–2026 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల కోసం బి – కేటగిరి ప్రవేశాలకు సంబంధించి నిర్ధారిత టైమ్ టేబుల్ ను రిలీజ్ చేసింది. ఇందుకు గాను అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్, www.tgche.ac.in లో అభ్యర్థులకు బి-కేటగిరీ నియమాల గురించి పూర్తి వివరాలు పొందు పర్చడం జరిగిందని తెలిపింది విద్యా మండలి.
TG B Tech – B Category Admissions
జూలై 19న అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ఆగస్టు 10 వరకు కొనసాగుతుందని తెలిపింది. బహిరంగ అడ్మిషన్ల ప్రక్రియను నిర్ధారించడానికి షెడ్యూల్ TGEAPCET 2025 రాష్ట్ర, జాతీయ స్థాయిలలో నిర్వహించే కౌన్సెలింగ్ రౌండ్‌లకు అనుగుణంగా ఉంటుందని పేర్కొంది ఉన్నత విద్యా మండలి.
బి-కేటగిరీ సీట్లు సాధారణంగా మేనేజ్‌మెంట్ కోటా కింద భర్తీ చేయబడతాయి . విద్యార్థులు రాష్ట్ర కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అదనంగా, అర్హత, దరఖాస్తు విధానం, సీట్ల కేటాయింపు పద్ధతులను పరిష్కరించే సమగ్ర మార్గ దర్శకాలను టీజీసీహెచ్ఈ విడుదల చేసింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంజనీరింగ్ కు సంబంధించి ఇతర కోర్సుల కంటే అత్యధికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ , సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సులకు డిమాండ్ ఉంటోంది. ఇతర కోర్సులు పెద్ద ఎత్తున నిలిచి పోవడం పట్ల ఆందోళన చెందుతున్నాయి కాలేజీలు.
Also Read : Reliance Growth : కెల్వినేటర్ ను స్వంతం చేసుకున్న రిలయన్స్
















