SSMB29 : ప్రముఖ సినీ ఫోటోగ్రాఫర్ గా పేరు పొందాడు సెంథిల్ కుమార్. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఉన్నట్టుండి తాను మహేష్ బాబుతో తీస్తున్న న్యూ మూవీ ఎస్ఎస్ఎంబీ29 నుంచి సినిమాటోగ్రాఫర్ నుంచి తీసి వేశాడు. దీనిపై మౌనం వీడారు సెంథిల్ కుమార్. ఇంతకు ముందు రాజమౌళి, సెంథిల్ ప్రయాణం గత కొన్నేళ్ల నుంచి కొనసాగుతూ వచ్చింది. వీరు కలిసి బాహుబలి చేశారు. జక్కన్న మూవీ నుంచి వైదొలిగిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు సెంథిల్ కుమార్. తనను కాకుండా వేరొకరితో రాజమౌళి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని దానిని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పాడు.
Cinematographer Senthil Kumar Drop from SSMB29 Movie
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు సినిమాటోగ్రాఫర్. ఆయన వేరే వారికి ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నాడు. దానికి నేను ఎలా అభ్యంతరం వ్యక్తం చేస్తానంటూ పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ వేర్వేరు వ్యక్తులతో వేర్వేరు సినిమాలపై పని చేయాలని కోరుకుంటారని అన్నాడు. ఇది వాస్తవమేనని సత్య దూరం కాదన్నాడు.
తనను తీసి వేసినంత మాత్రాన తామిద్దరి మధ్య ఉన్న అనుబంధం మాత్రం చెరిగి పోదన్నాడు సెంథిల్ కుమార్. గత 2003 సంవత్సరం నుంచి కలిసి పని చేస్తూ వచ్చామన్నాడు. ఇతర పనులు ఉన్నాయి. అందుకే ఎక్కువగా ఫోకస్ పెట్టలేక పోయానని చెప్పాడు. ఇదిలా ఉండగా ఎస్ఎస్ఎంబీ 29లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
Also Read : Hero Rajinikanth : స్మగ్లర్ దేవాగా సూపర్ స్టార్ రజనీకాంత్



















