బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ నటించిన తేజస్ విడుదలైంది. ఈ సినిమాకు కూడా మిశ్రమ స్పందనే వస్తోంది. నిజ జీవితంలో జరిగిన కథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక ఈ ఏడాది కంగనా రనౌత్ కు ఆశించిన మేర సక్సెస్ రాలేదనే చెప్పక తప్పదు. తను తమిళంలో నటించిన సీక్వెల్ మూవీ చంద్రముఖి 2 ఆడలేదు.
భారీ అంచనాలు పెట్టుకున్న కంగనకు షాక్ తగిలింది. ఇక తేజస్ మూవీపై అంతకు మించి నమ్మకం పెట్టుకుంది. కానీ నెగటివ్ టాక్ ఎక్కువగా రావడం ఒకింత విస్తు పోయేలా చేసింది. సైన్యంలో మహిళా పైలట్ చేసే ధైర్య సాహసాలు ఎలా ఉంటాయి. వృత్తి పట్ల నిబద్దత ఎలా ఉంటుందనే విషయంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు డైరెక్టర్.
ఈ దేశంలో ఎక్కువగా జీవితాలను పణంగా పెట్టేది సైనికులే. ప్రత్యేకించి ఆర్మీలో ఉన్న వాళ్లు, సరిహద్దులో కాపలా కాస్తున్న వాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక కంగనా రనౌత్ మొదటి నుంచీ భారత దేశం అంటే ఆమెకు పంచ ప్రాణం. ఈ దేశం గురించి ప్రత్యేకించి మోదీ గురించి ఎవరు ఏమన్నా తట్టుకోలేదు.
తాజాగా తను నటించిన తేజస్ మూవీని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు చూపించింది. ఆయన కంగనాను ప్రత్యేకంగా అభినందించాడు. అంతే కాదు కొన్ని సీన్లు చూసి కంట తడి కూడా పెట్టాడని కంగనా పేర్కొంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది.