Anand Mahindra : దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ఆనంద్ మహీంద్రా తన సుదీర్ఘంగా కొనసాగిన 44 ఏళ్ల ఉద్యోగ జీవితంను పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలను, జీవన బోధనలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసమయాలు వచ్చినప్పటికీ, అవి శాశ్వతం కావని ఆయన తేల్చిచెప్పారు.
Anand Mahindra Inspiring Story
“నా 44 ఏళ్ల కెరీర్‌లో నేర్చుకున్న ముఖ్యమైన విషయమేంటంటే – ఏదీ శాశ్వతం కాదు. కష్టాలు, ఒత్తిడులు, అవమానాలు ఇవన్నీ ఒక దశ మాత్రమే. తుఫానులో ఉన్నప్పుడు అది ఎప్పటికీ తగ్గదు అనిపిస్తుంది. కానీ ప్రతి తుఫానుకీ ఓ ముగింపు ఉంటుంది” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఆనంద్ మహీంద్రా ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా మాట్లాడుతూ – “పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, వాటికి భయపడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఒత్తిడిని మనపై చెలాయించనివ్వకండి. మీరు నమ్మిన మార్గంలో స్థిరంగా కొనసాగండి. కాలక్రమేణా మార్పులు తప్పక వస్తాయి. మీరు కోరుకున్నది ఒక్కరోజు నెరవేరకపోయినా, కచ్చితంగా నెరవేరుతుంది” అని సూచించారు.
ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో సజీవంగా ఉంటూ తరచూ తన జీవిత అనుభవాలు, ప్రేరణాత్మక సందేశాలను పంచుకుంటూ ఉంటారు. ఆయన చెప్పే మాటలు యువతకు, ఉద్యోగజీవులకు మార్గదర్శకంగా మారుతుండటంలో సందేహం లేదు.
Also Read : Singapore Growth : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్



















