చెన్నై : సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ ఏది చేసినా సంచలనమే. తను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం చెన్నై వేదికగా రిసెప్షన్ జరగనుంది. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చేరుకున్నారు. తాజాగా కావ్య మారన్ తన పెళ్లి కానుకగా తమ సంస్థ సన్ గ్రూప్ లో పని చేస్తున్న ఉద్యోగులకు ఏకంగా బంగారు ఉంగరాలను బహుమానంగా ఇచ్చారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. కావ్య మారన్ సన్ గ్రూప్ ఉద్యోగుల పట్ల ఒక ప్రత్యేకమైన చర్యతో అందరి మనసులను గెలుచుకున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలలో ఉద్యోగులు బంగారు ఉంగరాలు, చాక్లెట్లు , వివాహ ఆహ్వాన పత్రికలు ఉన్న బహుమతి పెట్టెలను అందుకున్నారు. ఈ చర్య గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. ఈ బహుమతులను చాలా మంది అభినందిస్తున్నారు. వైరల్ అయిన ఒక వీడియోలో ఒక ఉద్యోగి బహుమతి పెట్టెను తెరిచి, లోపల బంగారు ఉంగరాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతను ఒక బంగారు నాణెం వస్తుందని ఊహించాడు. కానీ దానికి బదులుగా ఉంగరం అందుకుని ఆశ్చర్యానికి లోనయ్యాడు.
పెట్టెలో ఉన్న ఆహ్వాన పత్రికలో నవంబర్ 25న ఒక ప్రత్యేక భోజన కార్యక్రమం ఉన్నట్లు పేర్కొనబడింది. అయితే, ఆ బంగారు ఉంగరాల ఖచ్చితమైన విలువ , బరువు వెల్లడి కాలేదు. అలాగే ఈ బహుమతులు అందుకున్న ఉద్యోగుల మొత్తం సంఖ్యను ధృవీకరిస్తూ ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

















