ముంబై : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఏకైక ముద్దుల కూతురు సారా టెండూల్కర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తను గతంలో క్రికెటర్ , భారత జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో డేటింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ సోషల్ మీడియా వేదికగా మరో వార్త గుప్పుమంది. తను బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కుమారుడు రాజ్వీర్ డియోల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 2027లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవుతారంటూ X (ట్విట్టర్), రెడ్డిట్ వేదికగా పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. అయిత ఈ ప్రచారంపై సారా టెండూల్కర్ కానీ రాజ్వీర్ డియోల్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక సారా టెండూల్కర్ ఎప్పుడూ ఏదో ఒక రకంగా సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్ కొనసాగుతూ వస్తోంది. బాలీవుడ్, నేషనల్ మీడియా, సోషల్ మీడియా అనే తేడా లేకుండా ట్రెండ్ అవుతూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె పేరు పలువురు ప్రముఖులతో జోడించి రూమర్లు విస్తృతంగా ప్రచారం అవుతూనే ఉన్నాయి. తన అఫైర్, డేటింగ్ కు సంబంధించిన వార్తలపై అటు సారా గానీ, ఇటు టెండూల్కర్ ఫ్యామిలీ గానీ స్పందించక పోవడంతో అవి రూమర్లుగానే మిగలి పోయాయి. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ చతుర్వేదితో అఫైర్ ఉందనే వార్తలు వచ్చాయి. కానీ అవేమీ నిలకడగా నిలబడక పోవడంతో రూమర్లుగానే మిగిలి పోయాయి. అనంత్ అంభానీ, హిమాంన్ష్ కోహ్లీతో అఫైర్ రూమార్లు వచ్చాయి. ఇవి కూడా గాలి వార్తలుగానే నిలిచాయి. తాజాగా సన్నీ డియోల్ కొడుకుతో పెళ్లి అంటూ రావడం కలకలం రేపింది. దీనిపై సచిన్ ఇంకా స్పందించ లేదు.



















