హైదరాబాద్ : టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడిగా పేరు పొందాడు అనిల్ రావిపూడి. తను తీసిన ప్రతి మూవీ బిగ్ సక్సెస్. టాప్ హీరోలతో సినిమాలు చేశాడు. తాజాగా మరోసారి విక్టరీ వెంకటేశ్ తో జతకట్టాడు. అంతే కాదు తనకు సినిమా రంగంలో లైఫ్ ఇచ్చిన నందమూరి కల్యాణ్ రామ్ ను కూడా తాను తీస్తున్న జనవరి 12 విడుదలలో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో అందాల తారలు కీర్తి సురేష్, కీర్తి శెట్టి కూడా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. వచ్చే ఏడాది 2027లో సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు అనిల్ రావిపూడి. పిచ్చ కామెడీని పండించడంలో అనిల్ రావిపూడికి పేరుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది.
ఈ చిత్రం నుండి మొదటి పాట ‘దివ్వికి దివ్వికి’ త్వరలో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ‘జనవరి 12 విడుదల’ చిత్రం 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సంగీత ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంలోని మొదటి పాట ‘దివ్వికి దివ్వికి’ గురించి ప్రకటన చేశారు. ఆ పోస్ట్‌లో జనవరి12విడుదల చిత్రంలోని సంగీత వేడుకలను దివ్వికి దివ్వికి పాటతో ప్రారంభిస్తామన్నారు . అయితే ఈ పూర్తి పాటను శనివారం విడుదల చేస్తామని ప్రకటించారు అనిల్ రావిపూడి. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఈ సాంగ్ కోసం.
















