హైదరాబాద్ : దమ్మున్న దర్శకుడిగా పేరు పొందాడు అట్లీ కుమార్. తను దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం రాకా. ఇందులో కీ రోల్స్ పోషిస్తున్నారు అల్లు అర్జున్, దీపికా పదుకొనే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. బన్నీతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా నటిస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా ప్రకటన మొదలుకొని అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ వరకు ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఇది పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామా కావడంతో ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ పని ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది; ఈ షెడ్యూల్ పూర్తయ్యాక, తదుపరి షెడ్యూల్ కోసం చిత్రబృందం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలి వెళ్లనుంది. మొదట ఒక కీలక సన్నివేశాన్ని దుబాయ్‌లో చిత్రీకరించాలని అనుకున్నప్పటికీ, ఆ తర్వాత ప్రణాళికలు మార్చుకుని హైదరాబాద్‌లోనే షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు.
దీనివల్ల అల్లు అర్జున్‌కు కూడా కొంత ఉపశమనం లభించింది. ఎందుకంటే ఆయన పదేపదే ముంబైకి ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. ముంబై , హైదరాబాద్ షెడ్యూల్లు పూర్తయ్యాక కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం విదేశాల్లో కూడా షూటింగ్ ప్లాన్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ‘రాకా’ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాత్రల కోసం ఆయన తన శారీరక రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ‘పుష్ప’ సిరీస్‌తో పాన్-ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఈ సినిమాతో అంతకు మించిన అద్భుత దృశ్య కావ్యాన్ని అందించాలని ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, ఆమె గర్భవతి కావడంతో, విరామం తీసుకునే లోపే ఆమెకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణను అట్లీ బృందం పూర్తి చేసింది. వీరితో పాటు రష్మికా మందన్న, జాన్వీ కపూర్ , మృణాల్ ఠాకూర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది 2027 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.



















