Hyderabad : ఇప్పటికే గ్లోబల్ సిటీగా పేరు పొందింది తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad). ఐటీ, లాజిస్టిక్, ఫార్మా హబ్ గా గుర్తింపు పొంది. భౌగోళిక , వాతావరణ పరిస్థితుల పరంగా చూస్తే ఇది అత్యంత సురక్షితమైన నగరంగా భావిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు సిటీని ఎంపిక చేసుకుంటుండడం విశేషం. రాబోయే రోజుల్లో ముంబైకి ధీటుగా ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్ ను మార్చాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేయడంలో నిమగ్నమై ఉంది.
Hyderabad towards Finalcial Hub
ఇందులో భాగంగా హైదరాబాద్‌ను (Hyderabad) భారతదేశంలో మొట్టమొదటి రౌండ్-ది-క్లాక్ ఆర్థిక కేంద్రంగా మార్చే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి నైట్ టైమ్ ఎకానమీ పేరుతో ప్రణాళికను తయారు చేస్తోంది. ఇందులో హెల్త్ కేర్, రిటైల్ , ఐటీ, టూరిజం, వినోదం , క్రీడలు తదితర ముఖ్యమైన రంగాలు ఉన్నాయి. వీటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తే బావుంటుందని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు సమాచారం.
ప్రస్తుత ప్రభుత్వం రాత్రి సమయ ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేందుకు గాను సమగ్ర ఫ్రేమ్ వర్క్ ను రూపొందించే పనిలో బిజీగా ఉంది. ఇందు కోసం ఆమ్ స్టర్ డ్యామ్ నైట్ మేయర్ వ్యవస్థను అధ్యయనం చేయడం, అలాగే హైదరాబద్ బాను రౌండ్ ది క్లాక్ ఆర్థిక కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది . ఇదే సమయంలో నగరం అంతటా రాత్రి సమయ కార్యకలాపాలను ఒక ప్రత్యేక యూనిట్ పర్యవేక్షించేలా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎన్టీఈ జోన్ లలో కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది.
రిటైల్ , వాణిజ్య ప్రాంతాలు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ప్రధాన మాల్స్ తో సహా వ్యాపారాలు అర్ధరాత్రి 2.30 దాకా తెరిచి ఉంచుతారు. పర్యాటక వినోద కేంద్రాలు చార్మినార్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ లాంటివి అర్ధరాత్రి 1.30 వరకు పని చేస్తాయి. దీని వల్ల టూరిజం మరింత అభివృద్ది చెందుతుందని భావిస్తోంది సర్కార్. ఇదే గనుక అమలులోకి వస్తే భారతీయ నగరాలకు ఓ నమూనాగా ఉపయోగ పడుతుందని ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం.
Also Read : Ex Minister Chinta Mohan Fired on Bandi : టీటీడీ గురించి మాట్లాడే హక్కు ‘బండి’కి లేదు
















