హైదరాబాద్ : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన సీక్వెల్ చిత్రం జైలర్ -2 . అక్టోబర్ 15న పండుగ కంటే ముందు విడుదలై దుమ్ము రేపుతోంది. వసూళ్ల వర్షం కురుస్తోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగ రాస్తోంది. దీంతో చిత్ర నిర్మాత, సన్ పిక్చర్స్ యజమాని ఏకంగా రెండు భారీ ధర పలికే కార్లను బహుమతిగా ఇచ్చాడు తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ కు. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. వరల్డ్ వైడ్ గా కోట్లాది రూపాయలు కురిపిస్తోంది ఈ మూవీ . ఇదిలా ఉండగా రజనీకాంత్ అంటే విపరీతమైన అభిమానం ప్రముఖ కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ కు. ఆయనను స్వయంగా తన ఇంటికి ఆహ్వానించాడు రజనీకాంత్. ఆయనను కూడా ఇమిటేట్ చేస్తుంటా కేరళ క్రికెటర్. ఇదే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కు తను ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉండగా తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది శాంసన్ నుంచి రజనీకాంత్ నటించిన జైలర్ -2ను చూసేందుకు ఏకంగా తనతో పాటు సిబ్బంది కోసం ఏకంగా థియేటర్ ను బుక్ చేశాడు.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. జట్టులో తమిళం తెలిసిన ప్రతిఒక్కరూ, సహాయక సిబ్బంది వస్తున్నారు అని పేర్కొన్నాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల రూపాయలకు పైగా షేర్‌ను దాటింది. ఈలోగా, రజనీకాంత్ వీరాభిమాని అయిన సంజు సామ్సన్, ‘జైలర్ 2’ ప్రదర్శిస్తున్న థియేటర్ మొత్తాన్ని బుక్ చేసి, తన సహచరులందరినీ ఆహ్వానించారు. నాకు రజినీ సార్ సినిమాలు చూడటం చాలా ఇష్టం. నేను ఎప్పుడూ ఆయన తదుపరి సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటాను. అందుకే, నేను నిజానికి ఒక రోజు ఆలస్యం అయ్యాను. ఆయన సినిమాలను వీలైనన్ని ఎక్కువగా చూడటానికి ప్రయత్నిస్తానని తెలిపాడు శాంసన్. నిన్న మాకు ఢిల్లీలో ఒక కార్యక్రమం ఉంది, అందుకే నేను సినిమా చూడలేక పోయాను అని పేర్కొన్నాడు. కానీ ఈరోజు, అదృష్టవశాత్తూ, నేను థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకోగలిగాను. నేను నా స్నేహితులను ఆహ్వానించాను. నా భార్య కూడా ఇక్కడే ఉంది. రజినీ సార్‌ను వెండితెరపై చూడటానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు.


















