హైదరాబాద్ : ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సతీమణి, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి స్పందించాడు. టాలీవుడ్లో అందమైన జంటగా పేరు పొందారు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న . ఈ ఇద్దరూ వివాహం తర్వాత మొదటిసారిగా కలిసి ప్రముఖ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చివరి సీజన్‌లోని రెండవ ఎపిసోడ్లో పాల్గొన్న ఈ జంట, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, వారి వివాహ ప్రతిపాదన వెనుక ఉన్న అసలు కథను వారు వివరించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచేలా చేసింది.
షోలో హోస్ట్ కరణ్ జోహార్ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు విజయ్ , రష్మికకు. మీ వివాహ ప్రపోజల్ ఎలా జరిగింది అని అడగగా, రష్మిక సిగ్గు పడుతూ తల దించుకున్నారు. దీనికి స్పందిస్తూ విజయ్ దేవరకొండ నవ్వుతూ నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది తనేనని పేర్కొన్నాడు. నేను చివరికి ‘సరే’ అని చెప్పేలోపు, ఆమె నన్ను దాదాపు వందసార్లు అడిగి ఉంటుంది అని చెప్పారు. విజయ్ మాటలకు ఆశ్చర్య పోయిన కరణ్ స్పందించగా, రష్మిక తన ముఖాన్ని దాచుకుంటూ నేను ఏడాది పొడవునా అడుగుతూనే ఉన్నాను” అని నిజం ఒప్పుకున్నారు. దీనికి విజయ్ సరదాగా, నేను అంత చెడ్డవాడిని ఏమీ కాదు కదా అని అనడంతో సెట్లోని వారంతా నవ్వులతో మునిగి పోయారు.
అదే షోలోని ‘రాపిడ్-ఫైర్’ రౌండ్లో ‘పుష్ప’ సహ నటుడు అల్లు అర్జున్ లేదా ‘యానిమల్’ సహ నటుడు రణబీర్ కపూర్ వీరిలో ఎవరిని ఎంచుకుంటారని కరణ్ అడగగా, రష్మిక వెంటనే అల్లు అర్జున్ పేరు చెప్పారు. అలాగే, రష్మిక కాకుండా మరెవరితో మంచి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఉంటుందని విజయ్‌ని అడగగా, రష్మిక వెంటనే ఎవరూ లేరు అని సమాధానమిచ్చారు. దీనికి విజయ్ చమత్కరిస్తూ సంతోషకరమైన వివాహ జీవితానికి నాకున్న ఏకైక మంత్రం ఇదేనని అన్నారు. మీ భార్య ఏది చెబితే దానికి ఎప్పుడూ ‘సరే’ అని చెప్పేయడమే అని అన్నారు.


















