హైదరాబాద్ : మాటల మాంత్రికుడు , టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ఆదర్శ కుటుంబం. టేకింగ్, మేకింగ్ లో తనదైన ముద్ర కనబర్చిన ఆయన చాలా కాలం తర్వాత విక్టరీ వెంకటేష్ తో ఈ మూవీ తీశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మూవీకి సంబంధించి ఇప్పటికే ట్రైలర్, నారాయణ పేరుతో సాంగ్ ను విడుదల చేశారు. పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తాజాగా ఆదర్శ కుటుంబం నుంచి మాల పేరుతో మరో పాటను ఆవిష్కరించారు. ఈ పాట విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది . స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం మాల పేరుతో కూడిన సినిమా పాటకు ప్రాణం పోసేలా చేసింది. వయసులో పెద్ద వాడైనా విక్టరీ వెంకటేష్ మాత్రం పాటలో జోష్ తో నటించాడు. ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు.
కామెడీని పండించడంలో వెంకీ తర్వాతే ఎవరైనా. ఇక డైలాగులతో ఆకట్టుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో వస్తున్న ఆదర్శ కుటుంబంపై పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉండగా, పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది, దీనిలో భాగంగా సోషల్ మీడియాలో ప్రమోషన్లను ముమ్మరం చేసింది. తాజాగా మాల ప్రత్యేక గీతం లిరికల్ వీడియోను విడుదల చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ పాట ఒక ఉత్సాహ భరితమైన డ్యాన్స్ నంబర్‌గా రూపొందింది. ఇందులో వెంకటేష్ ,నివేదా పేతురాజ్‌ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. రంగురంగుల దుస్తుల్లో వెంకటేష్ చాలా స్టైలిష్‌గా కనిపించగా, నివేదా తన గ్లామరస్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇక తమన్ ఎస్ సంగీతం అందించిన ఈ పాటకు ధనుంజయ్ సీపాన , రనినా రెడ్డి గాత్రం తోడవడంతో, ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే విడుదల చేసిన చిత్ర బృందం, అందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేసింది. టీజర్‌ను బట్టి చూస్తే, చిట్టి బాబుగా నటిస్తున్న వెంకీ తన దైనందిన గృహ కృత్యాలతో విసిగిపోయి కనిపిస్తాడు. అతని కుమారుడు సర్వ చదువులో వెనుకబడి ఉండటం, భార్య స్వర్ణ ఇతరులకు అప్పులు ఇచ్చే అలవాటు కలిగి ఉండటం వంటి అంశాలను ఇందులో చూపించారు.

















