హైదరాబాద్ : ఇప్పుడు తెలుగు సినిమాను తెలంగాణ పాటలు డామినేట్ చేస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు యాస, భాష పేరుతో తీవ్ర వివక్షకు గురి చేసిన వాళ్లు ఇప్పుడు జై తెలంగాణ అనక తప్పడం లేదు. ఈ ప్రాంతానికి చెందిన కవులు, కళాకారులు, గాయనీ గాయకులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు దుమ్ము రేపుతున్నారు. తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ ను ప్రభావితం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రాకు చెందిన హీరో నానిని పెట్టి తెలంగాణకు చెందిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసిన ది ప్యారడైజ్ కాసుల వర్షం కురిపించేలా చేసింది. అంతే కాదు నాని సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న మంచు మోహన్ బాబు ను ఇందులో విలన్ గా తెర పైకి తీసుకు రావడమే కాదు తనకు కమ్ బ్యాక్ ఇచ్చేలా చేశాడు.
తాజాగా మరో తెలంగాణ ప్రాంతానికి చెందిన దర్శకుడు సంపత్ నంది తాజాగా శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ తో కలిసి భోగి తీస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ కు విపరీతమైన బజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైంది సాంగ్. తెలంగాణ యాస, భాషతో దాని ఆత్మను ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఎగిలి వారంగా లేచి అనే పాటను రాశాడు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్. ఈ పాటకు ప్రాణం పెట్టి పాడాడు నల్గొండ గద్దర్. ఇప్పుడు ఈ పాట విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. వేలాది మంది దీనిని వింటున్నారు. ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి. ఈ పాటకు సంగీతం అందించాడు భీమ్స్ సిసిలిరియో.



















