హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో పలువురికి టోకరా ఇచ్చిన ఫార్చ్యూన్ 99 హోమ్స్ నిర్వాహకుడు మదిరాల రోసిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. బోగస్ పత్రాలతో ప్లాట్ల విక్రయాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్లాట్ పేరుతో బాధితుడి నుంచి రూ.25 లక్షలు వసూలు చేశాడని, రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో అనుమానం వచ్చి ఆరా తీస్తే స్థలంపై తనకు ఎలాంటి హక్కులు లేవని తేలింది. దీంతో కార్యాలయం మూసేసి పరారైన రోసిరెడ్డిని పట్టుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. సీసీఎస్, జూబ్లీహిల్స్ సహా పలు పీఎస్‌లలో గతంలోనూ చీటింగ్ కేసులు నమోదయ్యాయి. రోసిరెడ్డి బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. .. మోసాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా గతంలోనే రియల్టర్ మధిరాల రోసీ రెడ్డిని డిఫాల్టర్‌గా టీజీ రెరెరా ప్రకటించింది. తన పేరును తమ అధికారిక వెబ్సైట్లో ప్రదర్శించాలని ఆదేశించడంతో పాటు, 30 రోజుల్లోగా ప్లాట్‌ను రిజిస్టర్ చేయాలని భూ యజమానిని అథారిటీ నిర్దేశించింది .తన తాజా ఉత్తర్వులో, రిజిస్టర్ కాని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో ప్లాట్లను విక్రయించినందుకు ఎస్కేఏ రియల్టర్స్ ఎల్‌ఎల్‌పిపై టీజీ ఆర్ఈఆర్ఏ జరిమానా విచారణను ప్రారంభించింది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం, 2016 కింద రిజిస్టర్ అయ్యే వరకు అంబర్ హోమ్స్ ప్రాజెక్ట్‌లో ప్లాట్ల ప్రకటనలు, మార్కెటింగ్ లేదా అమ్మకాలను తక్షణమే నిలిపి వేయాలని ఆ సంస్థను ఆదేశించింది. రంగారెడ్డి జిల్లాలోని ముచర్ల గ్రామంలోని అంబర్ హోమ్స్ లేఅవుట్లో ప్లాట్ నెం. 173ను బుక్ చేసుకున్న హైదరాబాద్ నివాసి విశ్వనాథ్ రెడ్డి పాశం ఈ ఫిర్యాదును దాఖలు చేశారు.
















