హైదరాబాద్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ నెలలో ఆయా బ్యాంకులకు సంబంధించి సెలవులను వెల్లడించింది. మహాత్మా గాంధీ జయంతి, దుర్గా పూజ, దసరా , కర్వా చౌత్ వంటి ప్రధాన పండుగలు, జాతీయ సందర్భాల కారణంగా అక్టోబర్ లో భారతదేశం అంతటా అనేక బ్యాంక్ సెలవులు ఉంటాయి. ఈ నెలలో అనేక పండుగలు వస్తున్నందున, అసౌకర్యాన్ని నివారించడానికి బ్యాంక్ వినియోగదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి .ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం ఆయా రాష్ట్రాలు, జరుపుకునే పండుగలను బట్టి వేర్వేరు తేదీలలో బ్యాంకులు మూసి వేస్తారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా బ్యాంక్ సెలవు ఉంటుంది, అదే సమయంలో ఇతర తేదీలలో ప్రాంతీయంగా బ్యాంకులు మూసి వేయబడతాయి. నిర్దేశిత సెలవు దినాలలో బ్యాంక్ శాఖలు మూసి వేయబడినప్పటికీ, వినియోగదారులు సాధారణ లావాదేవీల కోసం ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్లు, ఏటీఎంలు, యూపీఐ సేవలను ఉపయోగించడం కొనసాగించవచ్చు.
గాంధీ జయంతి సందర్భంగా 2న అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో బ్యాంకులు మూసి వేయబడతాయి. ఇది భారతదేశం అంతటా పాటించే జాతీయ సెలవు దినం. 10న మహాలయ అమావాస్య కారణంగా కర్ణాటక , కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. దుర్గా పూజ ఉత్సవాలలో భాగమైన మహా సప్తమి వేడుకల కోసం త్రిపురలోని బ్యాంకులు 17న మూసి వేస్తారు. అక్టోబర్ 19న త్రిపుర, మిజోరాం, ఒడిశా, తమిళనాడు, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ . మేఘాలయ రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్ చేస్తారు. ఆయా రాష్ట్రాలను బట్టి మహా అష్టమి, మహా నవమి, ఆయుధ పూజ, దుర్గా పూజ , విజయదశమి వంటి పండుగల కోసం ఈ సెలవు దినం పాటించ బడుతుంది. 20న దసరా , విజయదశమి కారణంగా సెలవు. చాలా రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలో బ్యాంకులు మూసి వేయబడతాయి,
ఇది ఈ నెలలోని ప్రధాన బ్యాంకు సెలవు దినాలలో ఒకటిగా ఉంటుంది. దసరా, విజయదశమి, మహానవమి, ఆయుధ పూజ , దుర్గా పూజలను జరుపుకునే ప్రాంతాలలో బ్యాంకులు పనిచేయవు. సెలవుల షెడ్యూల్ ప్రకారం ఈ తేదీన మణిపూర్, సిక్కింలలో మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంటాయి. 21న త్రిపుర, కర్ణాటక, సిక్కిం, అస్సాం, కేరళ , పశ్చిమ బెంగాల్‌లలో బ్యాంకులు మూసి వేయబడతాయి.దుర్గా పూజ (దసైన్) వేడుకలలో భాగంగా అక్టోబర్ 22 , 23 తేదీలలో సిక్కిం రాష్ట్రంలో బ్యాంకులు క్లోజ్ చేస్తారు. 26న లక్ష్మీ పూజ, ఇతర ప్రాంతీయ సెలవులు ఉంటాయి. త్రిపుర, చండీగఢ్, జమ్మూ, శ్రీనగర్ , హిమాచల్ ప్రదేశ్లలో బ్యాంకులు మూసి వేస్తారు. 29 కర్వా చౌత్ సందర్బంగా హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు మూసి వేస్తారు. 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి . బ్యాంకులు పని చేయవు.















