హైదరాబాద్ : శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం ఇరుముడి ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఈ సినిమాకు సంబంధించి రవితేజ అద్భుతంగా నటించారు. ఆయన ఈ సినిమా ఒప్పుకోవడం, నియమ నిష్టలు పాటించి నటించడం కీలకం. ఇక ఇరుముడి అనేది శ్రీ అయ్యప్ప స్వామికి సంబంధించినది. ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ప్రేక్షకులను, ఇంటిల్లిపాదిని థియేటర్లకు రప్పించేలా చేసింది. ఇదిలా ఉండగా తాజాగా ఇరుముడి మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. ఏకంగా 5 భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18 శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ‘ఇరుముడి’ తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ డ్రామా. ఇందులో రవి తేజ ప్రధాన పాత్ర పోషించగా ప్రియా భవాని శంకర్, సాయి కుమార్ , బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం అనే ఐదు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. దీనివల్ల వివిధ ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులు ఈ సినిమాను ఆన్‌లైన్‌లో వీక్షించే అవకాశం కలుగుతుంది. ఇరుముడి’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మార్కును దాటి, ఈ చిత్రం థియేటర్లలో ఘన విజయం సాధించింది.
థియేటర్లలో ‘ఇరుముడి’ని చూడలేక పోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇవాల్టీ నుండి రవి తేజ నటించిన ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.


















