బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ ‘ఇంజనీర్స్ డే’ సందర్భంగా ప్రముఖ ఇంజనీర్ , రాజనీతిజ్ఞుడు సర్ ఎం. విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తామని డీకే శివకుమార్ తెలిపారు. వచ్చే ఏడాది నుండి ప్రభుత్వం ‘ఇంజనీర్స్ డే’ను అధికారికంగా నిర్వహిస్తుంది,” అని శివకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఒక ప్రతిపాదన సమర్పించ బడిందని, దానికి తాను ఆమోదం తెలిపానని ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఇంజనీర్లు తయారవుతున్నారని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఇంజనీర్లు ఉన్న రాష్ట్రం కర్ణాటకనేనని గుర్తు చేశారు సీఎం. వారిని గుర్తించడం మన బాధ్యత అని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లందరూ ఈ విషయాన్ని గమనించాలని స్పష్టం చేశారు సీఎం. మిమ్మల్ని గౌరవించడం మా బాధ్యత. (ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన) విధి విధానాలు అధికారులతో చర్చించిన తర్వాత ఖరారు చేస్తామన్నారు. ఇంజనీర్లు దేశానికి ఒక గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు సీఎం. శాస్త్రవేత్తల పరిశోధనలు , ఆవిష్కరణలను ఆచరణలో పెట్టేది వారేనని అన్నారు. అభివృద్ధికి ఇంజనీర్లే పునాది వేస్తారు అని ఆయన చెప్పారు. వాస్తు శిల్పం, నిర్మాణ రంగాలలో ఇంజనీర్ల కృషికి సాంప్రదాయకంగా గుర్తింపు లభించేదని, అయితే ఇప్పుడు వారి పాత్ర శక్తి , మౌలిక సదుపాయాలు, సమాచార సాంకేతికత వంటి రంగాలకు విస్తరించిందని అన్నారు డీకే శివకుమార్. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికే ఆదర్శప్రాయులు అని కొనియాడారు. కర్ణాటకకు ఆయన అందించిన సేవలు అపారమైనవి అని ప్రశంసించారు.
















