నల్లగొండ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన 22 ఎ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీని వెనుక ఏదో కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై.సమగ్ర విచారణ చేస్తాం అని ప్రకటించారు. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండవచ్చు అని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నానని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బాధితులకు న్యాయం చేస్తాం అని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
పొరపాటున జరిగిందా లేక .కావాలనే చేశారని పొలంలో విచారణ చేస్తాం అన్నారు. యాదగిరిగుట్టలో 42 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని సీఎంకు నాలుగు నెలల క్రితమే చెప్పానని తెలిపారు.
కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు మంత్రి. బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 30 శాతం కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో తప్పకుండా బయట పడుతుందని అన్నారు. సీఎం అమెరికా టూర్ తర్వాత దీనిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం అని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తమ ప్రభుత్వం మంచితనాన్ని కొంతమంది అధికారులు దుర్వినియోగం చేసి ఉండవచ్చు అని పేర్కొన్నారు. 22Aలో మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోను అన్నారు.

















