న్యూఢిల్లీ : ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నక్సల్స్ గురించి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రధానంగా యువతను ఉద్దేశించి మేదోపరమైన నక్సల్స్ ఉన్నారని వారిని పెకిలించి వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే క్రమంలో దేశంలో నక్సలిజం, తీవ్రవాదం తుది దశకు చేరుకుందన్నారు. ఇక మిగిలింది దీమాగీ నక్సల్స్ మాత్రమేనని అన్నారు. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఒక పీఎం స్థాయిలో ఉన్న మోదీ ఇంత దిగజారుడు, నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణమని పేర్కొంది. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. మేధోపరమైన నక్సల్ లేదా మరేదైనా సరే, ఇలాంటివి ఏవీ పనిచేయవు. కేవలం మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన విద్యావంతులైన యువతను ‘నక్సలైట్లు’ అని ఎలా ముద్ర వేస్తారు? అని మండిపడింది. ఇది పూర్తిగా అహంకారం తప్పా మరోటి కాదని పేర్కొంది.
సమస్యలను పరిష్కరించాలని కోరడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు సీజేఐ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్. సాయుధ నక్సలిజం ముప్పు అంతం దశకు చేరుకుందని, అయితే హింసను, అశాంతిని సృష్టించి దేశాన్ని తప్పుదోవ పట్టించే అవకాశాల కోసం చూసే మేధోపరమైన నక్సల్ మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఇంకా ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అటువంటి వ్యక్తులను గుర్తించి వేరు చేయాలని, యువతను ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావాలని ప్రధాని అన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సౌరవ్ దాస్. మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి. చైతన్యం మొదలైంది అని ఆయన అన్నారు. 12 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత దేశం స్వాతంత్ర దినోత్సవాన్ని నిజమైన అర్థంలో జరుపుకుంటోందని పేర్కొన్నారు. ఎందుకంటే మనలోని ఏదో ఒక విషయం ఎట్టకేలకు బంధనాల నుండి విముక్తి పొందింది అదే భయం’ అని అన్నారు. మౌనంగా ఉండాలని చెప్పబడిన ఒక తరం ఇప్పుడు తమ గళాన్ని, వేదికను కనుగొన్నదని, అలాగే ఏమీ మారదని చెప్పబడిన తరం మళ్లీ నమ్మడం ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు.
చైతన్యవంతమైన ఒక కొత్త శకం మొదలైంది. శాంతియుత నిరసనల యుగం ఆరంభమైంది అని దాస్ అన్నారు. ప్రజలు క్రమంగా పాతబడిన, అవినీతిపరులైన, అసమర్థులైన, అహంకారులైన వారిని ఏరివేస్తారని ఆయన పేర్కొన్నారు.
















