ముంబై : ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. తను ప్రస్తుతం పీకలలోతు ప్రేమలో కూరుకు పోయిందని ప్రచారం జరుగుతోంది. అంతే కాదు ఆ లవర్ ఎవరో కాదు ఇండియాలోనే కాదు వరల్డ్ క్రికెట్ లో టాప్ క్రికెటర్ గా పేరు పొందిన యంగ్ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ . తనతో ప్రేమాయణం నడుస్తోందంటూ పెద్ద ఎత్తున టాక్. దీనిపై తీవ్రంగా స్పందించారు నటి మృణాల్ ఠాకూర్. తమ మధ్య ప్రేమాయణం ఉందన్న వార్తలను మృణాల్ ఠాకూర్ ఖండించారు;. మీరంతా మాపై ఎందుకు ఇలాంటి కథలు అల్లుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొంది ఈ అమ్మడు. మీరంతా మీమీ ఇళ్లలో ప్రశాంతంగా ఉండాలని సూచించింది నటి. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో డేటింగ్ చేస్తోందన్న వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.
తను తెలుగులో కూడా నటించింది. ‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’, ‘డకాయిట్’ వంటి చిత్రాలలో సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది మృణాల్ ఠాకూర్. ఈ రకమైన పుకార్ల పట్ల అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ ఆమె ఇలా అన్నారు: బ్రో, కాస్త ప్రశాంతంగా ఉండండి… మేమిద్దరం కలిసి ఉన్నట్లు ఎక్కడైనా చూశారా? మీలాంటి విద్యావంతులు ఇలాంటి పుకార్లను ఎలా నిజమని నమ్ముతారు? అని ప్రశ్నించింది మృణాళ్ . దేశంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి. ‘జెన్-జీ’ తరం నుండి నేర్చుకుని, సరైన అంశాలపై వీడియోలు చేయండి, అప్పుడు మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయని హితవు పలికింది. అంతకు ముందు ముంబైలోని ఒక కేఫ్ నుండి మృణాల్ , యశస్వి కలిసి బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


















