హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది ప్రభుత్వం. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఈ ఏడాదికి సంబంధించి నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది .వివిధ ప్రభుత్వ విభాగాలలో 7,437 ఖాళీలను ప్రకటించింది. ఇందులో పోలీస్ శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ , అగ్నిమాపక , విపత్తు నిర్వహణ , అత్యవసర & పౌర రక్షణ శాఖ, అలాగే జైళ్లు , సంస్కరణ సేవల శాఖ వంటి విభాగాలలో అనేక రకాల ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుస్తోంది.
ఈ నియామక ప్రక్రియ పోలీస్ కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్, ఫైర్ ఫైటర్, వార్డర్ , ఇతర అనేక ఉద్యోగాల కోసం అభ్యర్థులకు అవకాశాలను కల్పిస్తోంది. ఇదిలా ఉండగా ఈ నియామక ప్రక్రియలో అత్యధిక సంఖ్యలో ఖాళీలు పోలీస్ శాఖలోనే ఉన్నాయి. 3, 697 పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) , 1,052 ఆర్మ్ రిజర్వ్ , 148 సబ్ ఇన్స్ పెక్టర్ సివిల్స్ , 23 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ , 14 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఆర్మ్డ్ రిజర్వ్) , 12 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ , 24 పోలీస్ కానిస్టేబుల్ (SARCP) , 20 పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) , 3 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ (SARCPL) , 7 పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్ ), ప్రత్యేక రక్షణ దళం (SPF) ఖాళీలు ఉన్నాయని తెలిపింది.
ఇక ప్రత్యేక రక్షణ దళం విభాగంలో 1,380 కానిస్టేబుల్ , 44 సబ్ ఇన్స్ పెపక్టర్ పోస్టులు ఉన్నాయని పేర్కొంది. అగ్నిప్రమాద విపత్తు ప్రతిస్పందన, అత్యవసర , పౌర రక్షణ విభాగం లో 751 అగ్ని మాపక సిబ్బంది, 39 స్టేషన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. జైళ్ల శాఖలో 196 వార్డర్ పురుషులు, 12 వార్డర్ మహిళలు, 14 డిప్యూటీ జైలర్ పురుషులు, 1 డిప్యూటీ జైలర్ మహిళ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది తెలంగాణ పోలీస్ శాఖ. ఆన్లైన్ దరఖాస్తుల షెడ్యూల్ను అధికారిక పత్రికా ప్రకటన ద్వారా విడిగా ప్రకటిస్తామని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. అప్లికేషన్ పోర్టల్ యాక్టివ్ అయిన తర్వాత, అభ్యర్థులు అధికారిక TSLPRB వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని కోరింది.

















