హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. కుటుంబ రిజిస్టర్ విషయంలో తీవ్రంగా మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఓటర్ల జాబితాలో ఒక్క అక్రమ రోహింగ్యా, బంగ్లాదేశీ లేదా పాకిస్థానీ కూడా ఉండేలా తమ పార్టీ అనుమతించదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ కుటుంబ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. సర్ ప్రక్రియ సమయంలో తమ అక్రమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా కుటుంబ రిజిస్టర్ ధృవీకరణ పత్రాలను జారీ చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఓటర్ల జాబితాలో ఒక్క అక్రమ రోహింగ్యా, బంగ్లాదేశీ లేదా పాకిస్థానీ కూడా ఉండేలా తమ పార్టీ అనుమతించదని వార్నింగ్ ఇచ్చారు రాంచందర్ రావు.
దశాబ్దాలుగా అక్రమ ఓటు బ్యాంకులకు ఆశ్రయం కల్పించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు, ఇప్పుడు ఎస్.ఐ.ఆర్ పరిశీలనలో తమ రాజకీయ పతనానికి నాందిని చూస్తున్నాయని అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ రిజిస్టర్ ధృవీకరణ పత్రాలను జారీ చేయడంలో తొందర పడుతోందన్నారు. ,ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. వీధుల్లోనూ, న్యాయస్థానాల్లోనూ పోరాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన సంచలనన ప్రకటన చేశారు రామచందర్ రావు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ‘తెలంగాణ కుటుంబ రిజిస్టర్’ను ఏర్పాటు చేసి, ‘మీ-సేవ’ ప్లాట్‌ఫారమ్ ద్వారా కుటుంబ రిజిస్టర్ ధృవీకరణ పత్రాన్ని పొందే సదుపాయాన్ని ప్రవేశ పెట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.















