అమెరికా : న్యూయార్క్ లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాను అదనపు సమయంలో 1-0తో ఓడించి స్పెయిన్ FIFA ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచింది. ట్రోఫీ, పతకాలు , ఛాంపియన్‌షిప్ రింగ్‌లతో పాటు, స్పెయిన్ తన విజయం కోసం భారీ బహుమతి మొత్తాన్ని కూడా అందుకుంది. గత ఏడాది, FIFA కౌన్సిల్ 2026 ప్రపంచ కప్ కోసం రికార్డు స్థాయి ఆర్థిక కేటాయింపుగా 727 మిలియన్ డాలర్లను ఆమోదించింది. ఇందులో 655 మిలియన్ డాలర్లను పాల్గొనే 48 దేశాలకు బహుమతి మొత్తంగా కేటాయించారు. ఖతార్‌లో జరిగిన 2022 FIFA ప్రపంచ కప్‌లో పంపిణీ చేసిన బహుమతి మొత్తంతో పోలిస్తే ఇది 50% పెరుగుదల.
విజేతగా నిలిచిన స్పెయిన్ 50 మిలియన్ డాలర్ల బహుమతి మొత్తాన్ని అందుకోనుండగా, రన్నరప్ అర్జెంటీనా 33 మిలియన్ డాలర్లను గెలుచుకుంటుంది. బహుమతి మొత్తాల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి: విజేత స్పెయిన్: 50 మిలియన్ డాలర్లు కాగా రన్నరప్ అర్జెంటీనా కు 33 మిలియన్ డాలర్లు, మూడవ స్థానం లో నిలిచిన ఇంగ్లాండ్ 29 మిలియన్ డాలర్లు , నాలుగవ స్థానం లో ఉన్న ఫ్రాన్స్ 27 మిలియన్ డాలర్లు అందుకుంది. ఇక 5 నుండి 8వ స్థానం లో నిలిచిన జట్లకు 19 మిలియన్ డాలర్లు . 9 నుండి 16వ స్థానంలో ఉన్న జట్లకు 15 మిలియన్ డాలర్లు, 17 నుండి 32వ స్థానంలో నిలిచిన జట్లకు 11 మిలియన్ డాలర్లు అందుకోగా, 33 నుండి 48వ స్థానంలో చోటు దక్కించుకున్న జట్లకు 9 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా అందుకున్నాయి.



















