హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీసుల పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్. హైదరాబద్ లో కీలకమైన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు. పలీసు శాఖ ఎదుర్కొంటున్న చాలా ముఖ్యమైన సమస్యలపై చర్చించారు. ఎస్ఆర్సి నివేదిక, మావోయిజం పేరుతో ఉన్న అనవసర భద్రతను ఉపసంహరించు కోవడం ద్వారా దాదాపు 400 మంది సిబ్బందిని, బిపి కార్ల సముదాయాన్ని ఆదా చేయడం జరిగిందని పేర్కొన్నారు డీజీపీ. మానవ వనరులు, వాహనాల ఆడిట్, దాని అమలు పద్ధతి, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒకే ప్రాంగణం నుండి గ్రేహౌండ్స్ , ఆక్టోపస్‌ల పనితీరు, టీజీ పోలీస్ మాన్యువల్ , దాని సంకలనాలకు తుది మెరుగులు దిద్దడంపై ఫోకస్ పెట్టాలన్నారు.
ఐపీఎస్ యూనిఫాం సమస్యలు , క్రాస్ బెల్టులు ధరించడం, లాఠీలు పట్టుకోవడం వంటి పాత పద్ధతులు , ప్రస్తుత పరిస్థితులలో వాటి ప్రాసంగికత, టీజీఎస్పీ సిబ్బంది వివిధ సమస్యలు , వాటిలో ఇతర విభాగాలు ఎలా సహకరించాలి, నిఘా, ఆహార కల్తీ, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం వివిధ కొత్త అమలు విభాగాల ఏర్పాటు, ట్రాఫిక్ , రోడ్డు భద్రతా బ్యూరో ఏర్పాటు, టెక్నాలజీ , కంప్యూటర్ సర్వీసెస్ విభాగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను నిర్వహించగల కొత్త విభాగంగా పునర్వ్యవస్థీ కరించడం అత్యంత ముఖ్యమని ఈ సందర్బంగా పేర్కొన్నారు డీజీపీ సీవీ ఆనంద్. సీసీటీఎన్ఎస్ 3.0 – టీజీసీఓపీ 3.0 – హాక్ ఐ 3.0 పనుల పురోగతి వంటి అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు డీజీపీ. విధానాలను ఖరారు చేసేటప్పుడు వ్యక్తం చేసిన సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

















