కేరళ : కేరళ రాష్ట్ర మాజీ సీఎం పినరయ్ విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవర్ లో ఉన్న యుడీఎఫ్ ఫ్రంట్ కాంగ్రెస్ సర్కార్ ను ఏకిపారేశారు. వాయనాడు లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నప్పటికీ, యంత్రాంగం అందిస్తున్న సమాచారంలో పొంతన లేదని విజయన్ ఆరోపించారు. గురువారం మాజీ సీఎం మీడియాతో మాట్లాడారు. వయనాడ్ కొండచరియల ఘటన నిర్వహణలో చేతులెత్తేసిందని, సరైన సమయంలో స్పందించక పోవడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇవాళ కొండచరియలు విరిగిపడిన జంట-టన్నెల్ ప్రాజెక్ట్ ప్రాంతంలో జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించడం జరిగిందన్నారు.
మంత్రుల మధ్య సమన్వయం లోపించిందని, టన్నెల్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల విషయంలో వాస్తవాలను వక్రీకరించారని పినరయ్ విజయన్ ఆరోపించారు. విపత్తు జరిగిన ప్రాంతం, ఆసుపత్రులు , సహాయక శిబిరాలను సందర్శించానని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని, అయితే యంత్రాంగం అందిస్తున్న సమాచారంలో పొంతన లేదని పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి వీడీ సతీశన్ విచారణకు ఆదేశించడం మంచి పరిణామం అని విజయన్ అన్నారు. అయితే, ఆ ప్రాంతానికి సంబంధించిన పర్యావరణ సున్నితత్వం , ప్రతిపాదిత టన్నెల్ రోడ్డుకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

















