Prakash Raj : : హైదరాబాద్ – తెలుగు భాష అమ్మ లాంటిది హిందీ భాష పెద్దమ్మ లాంటిది అంటూ కామెంట్స్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఆయనను పెద్ద ఎత్తున భాషాభిమానులు, కవులు, కళాకారులు, ప్రజాస్వామిక వాదులు మండిపడుతున్నారు. ఎందుకు, ఎవరి కోసం పార్టీ పెట్టారో ఆ సిద్దాంతాన్ని వదిలేసి కేవలం పదవే పరమావధిగా, ప్రచారమే లక్ష్యంగా ముందుకు సాగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్బంగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఓ అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటు అంటూ పేర్కొన్నారు.
Actor Prakash Raj Slams Pawan Kalyan
పవన్ వైఖరిలో పదునైన మార్పు రావాలని, అతన్ని ‘అమ్ముడైన వ్యక్తి’ అని ముద్ర వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవించాలని డిమాండ్ చేస్తూ పవన్ చేసిన 2017 పోస్ట్ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. పవన్ కళ్యాణ్ ఇటీవల హిందీని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు మరోసారి విమర్శలకు దారితీశాయి, సాంస్కృతిక, భాషా సమస్యలపై ఆయన అస్థిరతను నొక్కి చెబుతున్నాయి.
జూలై 11న హైదరాబాద్‌లో జరిగిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాజ్య భాషా విభాగ్ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ హిందీని ఏకం చేసే భాషగా అభివర్ణించారు. హిందీ నేర్చుకోవడాన్ని మన గుర్తింపును వదులుకున్నట్లుగా చూడకూడదని అన్నారు. కానీ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిసి ఉన్నట్లుగా చూడాలన్నారు. మనం ఉర్దూ లేదా పర్షియన్‌ను అంగీకరించ గలిగితే, హిందీని ఎందుకు అంగీకరించ కూడదంటూ ప్రశ్నించారు. ఒక పోస్ట్‌లో అభివర్ణిస్తూ ఛీ, ఛీ… ఇంత రేంజ్‌లో తనను తాను అమ్ముకుంటున్నారా అంటూ ప్రకాశ్ రాజ్ నిలదీశారు.
Also Read : YS Jagan Fired on AP Govt : ఏపీలో రాచరిక..నియంతృత్వ పాలన : జగన్



















