అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు తప్పనిసరిగా క్షేత్రస్తాయిలో పర్యటించారు. సీఎం సూచనల మేరకు క్షేత్రస్థాయి పర్యటనల విషయంలో సర్క్యులర్ జారీ చేశామని ఈ సందర్బంగా సీంకు తెలిపారు సీఎస్. ఈ మేరకు నెలలో సెక్రటరీలు 3 రోజులు, హెచ్‌ఓడీలు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సర్కులర్ జారీ చేసినట్టు వివరించారు. సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ పరిష్కారాలు చూపాలని సీఎం ఆదేశించారు. పీజీఆర్ఎస్ విధానం మరింత మెరుగ్గా పనిచేసేలా స్టాండర్ట్ ఆపరేటివ్ ప్రోసీజర్స్ జారీ చేసినట్టు వెల్లడించారు.
సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులను వెంట పెట్టుకుని సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రానికి వచ్చారు. ఆర్టీజీఎస్ పనితీరును ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ సీఐఐ ప్రతినిధులకు వివరించారు. ఏఐ సహా వివిధ టెక్నాలజీలను పరిపాలనలో ఏ విధంగా వినియోగిస్తున్నామనే అంశాన్ని భాస్కర్ వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆర్టీజీఎస్ పని విధానానికి సంబంధించిన కేస్‌స్టడీస్‌ను సీఐఐ ప్రతినిధులకు వివరించారు. సీఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఐఐ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.















