Peddi : ఒకే ఒక్క సినిమా ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సన మరోసారి సంచలనంగా మారారు. తను టాప్ హీరో రామ్ చరణ్ తో పెద్ది (Peddi) మూవీ తీస్తున్నాడు. ఇప్పటికే శర వేగంగా షూటింగ్ కొనసాగుతోంది. సినిమాకు సంబంధించిన పోస్టర్స్ , గ్లింప్స్ కు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేసింది. ఇక తన టేకింగ్, మేకింగ్ లో ప్రత్యేకత ఉండేలా చూడడం అలవాటు సనకు. ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్. తను ఆ మధ్యన క్యాన్సర్ వ్యాధికి గురయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. వెంటనే షూటింగ్ లో పాల్గొన్నాడు. తన సినీ కెరీర్ లో పెద్ది మూవీ ప్రత్యేకమైన చిత్రంగా పేర్కొన్నాడు శివ రాజ్ కుమార్. ఆయనకు అటు తమిళ్, ఇటు కన్నడ, తెలుగు సినిమాలకు సంబంధించి ఫ్యాన్స్ ఉన్నారు.
Peddi Movie Updates
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడే ఈ శివరాజ్ కుమార్. ఇదిలా ఉండగా పెద్ది మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో శివన్న గౌరి నాయుడిగా మనల్ని పలకరించ బోతున్నాడు. బుచ్చిబాబు సన పూర్తిగా గ్రామీణ నేపథ్యంతో పెద్ది మూవీని తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఎలెవన్ స్కిప్పర్ మహేంద్ర సింగ్ ధోనీ. దీంతో పెద్దిపై అంచనాలు మరింత పెరిగేలా చేశాయి. శివ రాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్బంగా మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. చక్రవర్తి గౌరి నాయుడు పాత్రను పోషిస్తున్నాడని తెలిపారు.
పెద్ది చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ పూర్తిగా అట్టర్ ప్లాప్ అయ్యింది. దీనికి దర్శకత్వం వహించాడు శంకర్. కానీ వర్కవుట్ కాలేదు. దీనిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. చివరకు మెగా ఫ్యాన్స్ కు నిర్మాత సారీ చెప్పే దాకా వెళ్లింది.
Also Read : Hero Pawan Kalyan-OG : పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్



















