చెన్నై : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి రమ్యకృష్ణన్ సంచలనంగా మారారరు. ఆమె గతంలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. మెప్పించారు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడా స్వంతం చేసుకున్నారు. ప్రస్తుతం అడపా దడపా పాత్రలు చేస్తూ వస్తున్నారు. తాజాగా తను ప్రముఖ రియాల్టీ షో కు హోస్ట్ గా ఎంపికయ్యారు. తాజాగా ప్రముఖ వినోద సంస్థగా పేరు పొందిన జియో హాట్ స్టార్ లో సెకండ్ లవ్ డేటింగ్ షో ప్లాన్ చేసింది. దీని నిర్వహణకు సంబంధించి హోస్ట్ గా నటి రమ్యకృష్ణన్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీనికి విచిత్రంగా సెకండ్ లవ్ అని పేరు పెట్టింది.
రెండో ఛాన్స్ అనే ప్రధాన ఇతివృత్తాన్ని ప్రతిబింబించేలా , కట్టు కట్టిన లవ్ సింబల్ తో కూడిన హృదయాన్ని చేతిలో పట్టుకున్న రమ్యకృష్ణన్ పోస్టర్‌తో చిత్ర బృందం ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. బనిజై ఆసియా నిర్మిస్తున్న ‘సెకండ్ లవ్’ అనే కొత్త తమిళ రియాలిటీ సిరీస్‌కు నటి రమ్యకృష్ణన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షో జియో హాట్‌స్టార్ లో ప్రసారం కానుంది. గతంలో ప్రేమలో విఫలమై బాధపడిన 12 మంది పోటీదారులు, తమ జీవితాలను తిరిగి నిర్మించుకుంటూ మళ్లీ ప్రేమను పొందే అవకాశాన్ని అన్వేషించే ప్రక్రియను ఈ షో చూపిస్తుంది. అంతే కాకుండా మరొక అవకాశం. మరొక ప్రేమకథ అనే సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఈ షో త్వరలో జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వస్తుందని వారు ధృవీకరించారు.
రమ్యకృష్ణన్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ పోటీదారులు తమ గత అనుభవాలను ఎదుర్కొని కొత్త బంధాలను ఏర్పరచుకునే ప్రయాణంలో వారికి మార్గనిర్దేశం చేస్తారు. ‘సెకండ్ లవ్’ ప్రసారం ప్రారంభమయ్యే అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. వృత్తిపరంగా చూస్తే, రమ్యకృష్ణన్ రాబోయే ప్రాజెక్ట్‌లలో రజనీకాంత్‌తో కలిసి నటించనున్న ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ కామెడీ సీక్వెల్ ‘జైలర్ 2’ ప్రధానమైనది.



















