న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది . దేశంలోని గృహిణుల శ్రమ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ సందర్బంగా గృహిణులు ‘దేశ నిర్మాతలు’ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. న్యాయమూర్తులు సంజయ్ కరోల్ , ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గృహిణులు అందించే సేవల నష్టాన్ని అంచనా వేయడానికి నెలకు రూ. 30,000 నామమాత్రపు (notional) ఆదాయాన్ని నిర్ణయించింది. వేతనం లేని గృహ నిర్వహణ పనుల ఆర్థిక విలువను గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది.
గృహిణులు “దేశ నిర్మాతలు” అని, న్యాయపరమైన పరిహార దావాలలో గృహ సంరక్షణ సేవల నష్టాన్ని ఒక ప్రత్యేక పరిహార అంశంగా పరిగణించాలని కోర్టు పేర్కొంది. గృహిణులు అందించే సేవల నష్టాన్ని అంచనా వేయడానికి న్యాయమూర్తులు సంజయ్ కరోల్ , ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం సంచలన కామెంట్స్ చేసింది. కుటుంబంలో, సమాజంలో గృహిణులు పోషించే కీలక పాత్రను నొక్కి చెప్పింది. వారి కృషి కేవలం ఇంటి నిర్వహణకే పరిమితం కాకుండా దేశ నిర్మాణానికి కూడా దోహద పడుతుందని కోర్టు గమనించింది. గృహిణులు ఇంటికి ఎంతో కృషి చేస్తారు. వారు దేశ నిర్మాతలు. వారు దేశాన్ని నిర్మిస్తారు. ఆ కృషిని ఎలా అంచనా వేయాలి..? దానికి ఆర్థిక విలువను ఎలా కట్టాలి? ఇకపై ‘హోమ్‌మేకర్’ (గృహిణి) అనే పదానికి ‘నేషన్ బిల్డర్’ (దేశ నిర్మాత) అనే అర్థం కూడా జోడించ బడుతుంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
గృహిణుల గణనీయమైన, కానీ తరచుగా వేతనం లేని కృషిని గుర్తిస్తూ, గృహ సంరక్షణ సేవలకు సంబంధించిన నష్టాన్ని అదనపు పరిహార అంశంగా పరిగణించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ఈ విషయంలో జారీ చేసిన ఆదేశాల అమలును అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పర్యవేక్షిస్తారని ధర్మాసనం ఆశాభావం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా గృహిణులు చేసే వేతనం లేని గృహ పనుల ఆర్థిక ,సామాజిక విలువను గుర్తించే దిశగా ఈ తీర్పు ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించ బడుతోంది.


















