చెన్నై : మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా బీసీసీఐ టి20 జట్టును ప్రకటించింది. సూర్య కుమార్ యాదవ్ ను తప్పించింది. శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఆపై ఎవరూ ఊహించని విధంగా తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ గా ప్రమోట్ చేసింది. దీనిపై సీరియస్ గా స్పందించాడు చిక్కా. అక్షర్ పటేల్ స్థానంలో, కనీసం ఒక జట్టుకు కూడా సరిగ్గా కెప్టెన్సీ చేయని తిలక్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు ఎలా అప్పగిస్తారన ప్రశ్నించారు. అగార్కర్ , గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై పునరాలోచన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రజత్ పాటిదార్‌ను పట్టించుకోక పోవడాన్ని తప్పు పట్టాడు. తన సారథ్యంలో ఆర్సీబీ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుందని, ఆ విషయం మరిచి పోతే ఎలా అని అన్నాడు.
2026 IPLలో 192.69 స్ట్రైక్ రేట్‌తో 501 పరుగులు చేసి, 42 సిక్సర్లు బాదాడు. అయినప్పటికీ, జట్టు ఎంపికలో అతన్ని పూర్తిగా విస్మరించడం దారుణమన్నాడు. పాటిదార్‌లా ప్రత్యర్థి బౌలింగ్ దాడిని చిన్నాభిన్నం చేసే సామర్థ్యం గానీ, మ్యాచ్ గెలిపించే ప్రభావం గానీ తిలక్‌లో లేవని శ్రీకాంత్ వాదించారు. పాటిదార్ వంటి ఆటగాళ్లతో పోలిస్తే తిలక్ ఇటీవలి ఫామ్ , భారీ షాట్లు కొట్టే సామర్థ్యంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో స్థానం దక్కడం సమంజసం కాదు. సుందర్ బౌలింగ్ చేయడం చాలా తక్కువ అని పేర్కొన్నాడు. సుందర్ , బిష్ణోయ్ కంటే కృనాల్ పాండ్యా బెటర్ అని అన్నాడు శ్రీకాంత్.



















