న్యూఢిల్లీ : ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాహుల్ గాంధీ తమ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పని చేస్తుందన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజానీకి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం తమ ప్రాణాలను అర్పించిన వ్యక్తులకు నివాళులర్పించారు కాంగ్రెస్ ఎంపీ . తెలంగాణ లక్షలాది మంది ప్రజల పోరాటం , త్యాగం అని, కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమాన అవకాశాలు , రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి గౌరవంతో ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకు వెళుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ చేస్తున్నా. తెలంగాణ లక్షలాది మంది ప్రజల పోరాటం, త్యాగం. తమ కలల తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరినీ ఈ రోజు మనం స్మరించు కుంటున్నామన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం కీలక ప్రకటన చేశారు. లక్షలాది మంది త్యాగం, పట్టుదల, అచంచలమైన ఆకాంక్షలతో పుట్టిన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో తెలంగాణ ఏర్పాటు ఒక కీలక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ , సోనియా గాంధీ నాయకత్వంలో, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రజల చిరకాల ఆకాంక్షలను గౌరవించి, భారతదేశపు అత్యంత పిన్న వయస్సు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పాటులో చారిత్రాత్మక పాత్ర పోషించింది అని తెలిపారు.

















