తమిళనాడు : తమిళనాట కొత్త్ చరిత్రకు నాంది పలికారు టీవీకే విజయ్. కేవలం పార్టీ పెట్టిన 2 సంవత్సరాలకే పవర్ లోకి వచ్చాడు. ఇది ఎవరూ ఊహించని జర్నీ. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. పేరెంట్స్ చంద్రశేఖర్, శోభ. ఈ సందర్భంగా తనను అందరూ తక్కువ అంచనా వేశారు. కానీ తాను అనుకున్నది చేసి చూపించాడు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు టీవీకే చీఫ్. ఆయన జనాకర్షక పథకాలను ప్రకటించాడు. వాటిని తప్పకుండా అమలు చేస్తానని చెప్పాడు. ఇందులో ప్రధానమైనవి కుటుంబానికి పెద్దగా వ్యవహరించే మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం కల్పించడం. సంవత్సరానికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు. వివాహానికి 8 గ్రాముల బంగారం, పట్టు చీరలు.
వృద్ధులకు, దివ్యాంగులకు నెలకు రూ. 3,000 పెన్షన్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువులకు వారి తల్లులకు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల , 5 లక్షల వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌ల కల్పన. నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 4,000, డిప్లొమా కలిగిన వారికి ₹2,500 భృతి. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.విద్యార్థులకు ఉన్నత చదువులకు రూ. 20 లక్షల విద్యా రుణాలు. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు పంట రుణాల పూర్తి మాఫీ, పెద్ద రైతులకు 50% రుణ మాఫీ. అధిక కనీస మద్దతు ధర వరికి క్వింటాలుకు ₹3,500; చెరకుకు టన్నుకు ₹4,500.వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు, 21 రోజుల్లోనే వ్యాపార లైసెన్సుల మంజూరు ఉన్నాయి .
















