Bandi Sanjay : తిరుమల – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన పుణ్య క్షేత్రం తిరుమలను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు, పూజారులు ఆశీర్వచనం అందించారు కేంద్ర మంత్రికి. శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్ర పటంతో పాటు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.
Union Minister Bandi Sanjay Shocking Comments
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ (Bandi Sanjay). తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ)కి ఘనమైన వారసత్వం, చరిత్ర ఉందన్నారు. టీటీడీలో అన్యమతస్తులు ఎవరున్నా వారు ఇక్కడ ఉండేందుకు వీలు లేదన్నారు. వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇతరులు ఎవరున్నా ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. పురాతన ఆలయాలను గుర్తించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ముఖ్య కార్య నిర్వహణ అధికారి జె. శ్యామల రావు, ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీర బ్రహ్మంలను కోరారు బండి సంజయ్ కుమార్ పటేల్.
అంతే కాకుండా ప్రతి రోజూ తిరుమల క్షేత్రానికి వేలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కొండగట్టు, వేములవాడ, ఇల్లందు రామాలయానికి టీటీడీ నిధులు వెంటనే మంజూరు చేయాలని సూచించారు. ఓటు రాజకీయాలకు టీటీడీ వేదిక కాకూడదని స్పష్టం చేశారు. ఆయా పార్టీలకు చెందిన వారు ఆచి తూచి మాట్లాడాలని సూచించారు.
Also Read : World Population Day : నేడే ప్రపంచ జనాభా దినోత్సవం
















