రాజస్థాన్ : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2026 మెగా టోర్నీలో రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన విజయాలు సాధిస్తోంది. వరుసగా ఇది మూడో గెలుపు. లీగ్ మ్యాచ్ లో భాగంగా బలమైన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ అనూహ్యంగా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది అనూహ్యంగా. ఇది ఊహించని షాక్ అని పేర్కొన్నారు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ప్రధానంగా రాజస్థాన్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని, అందుకే ఓటమి పాలయ్యామని తెలిపారు.
ఇదే సమయంలో తమ జట్టు పరంగా కొంత బౌలింగ్ బలహీనంగా ఉండడం వల్లనే పరాజయం పొందినట్లు చెప్పారు పాండ్యా. తాము వేయాల్సిన బంతులను సరిగ్గా వేయలేక పోయామని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మ్యాచ్ పరంగా ముందు మా బౌలర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. బౌలింగ్ విభాగంగా మేము ఆశించిన స్థాయిలో రాణించలేక పోయామన్నారు.
ఈ మ్యాచ్‌ను నేను బ్యాటింగ్ మీద అభాండం వేయనని అన్నారు. తాము 27 పరుగుల తేడాతో ఓడిపోయామన్నారు, అంటే మరో 5 మంచి బంతులు పడి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నారు. తాము సరైన బంతులను సరిగ్గా వేసి ఉంటే, మ్యాచ్‌లో నిలబడే వాళ్ళం అన్నారు. వారి ఓపెనర్లు బాగా ప్రారంభించారని, కానీ తాము పూర్తిగా వెనుకబడి పోయినట్లు ఒప్పుకున్నాడు .ఇదిలా ఉండగా ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్ లు ఆడింది రాజస్థాన్ రాయల్స్ టీం. మూడింటిలోనూ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. అటు బ్యాటింగ్ పరంగా ఇటు బౌలింగ్ పరంగా అత్యంత బలంగా ఉంది .



















