YS Sharmila : విజయవాడ – రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila). గురువారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఓ వైపు తోతాపురి రైతులు నానా తంటాలు పడుతుంటే తండ్రీ కొడుకులు పర్యటనల పేరుతో ఎంజాయ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. కనీస ధర అందించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. మాటలు కాదు రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నువ్వు కొట్టినట్లు చెయ్యి నేను ఏడ్చినట్లు చేస్తా ఇదే కూటమి – YCP మధ్య యవ్వారంగా నడుస్తోందని సీరియస్ కామెంట్స్ చేశారు షర్మిలా రెడ్డి.
YS Sharmila Shocking Comments on AP Govt
కూటమి సారధ్యంలో బంగారుపాళ్యం మామిడికాయ సినిమా ను రక్తి కట్టించారని ఎద్దేవా చేశారు. జగన్ వి డబ్బుతో కూడిన బలప్రదర్శనలు తప్పా..రైతులపై ప్రేమ కానే కాదన్నారు. పీఎం మోడీకి దత్తపుత్రుడు జగన్ అని రాష్ట్రంలో ఏది చేసినా చెల్లుబాటు అవుతుందన్నారు. ధరల పతనంతో రైతుకు తోతాపురి చేదు అయిందన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ధర లేక రైతులు విలవిలలాడుతుంటే పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు ఏపీపీసీసీ చీఫ్ .
16 రూపాయలు ధర కడితే తప్పా కోలుకోలేమని రైతులు చెప్తుంటే, 4 రూపాయల కన్నా ఎక్కువ కొనడం లేదని మొత్తుకుంటుంటే 12 రూపాయలు అందించి న్యాయం చేశామని అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు షర్మిలా రెడ్డి. తక్షణం తోతాపురి రైతుల కష్టాలపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని కోరారు. పైకి 500 మందితో అనుమతి ఇస్తారు కానీ 10 వేల మందితో వచ్చినా సహకరించడం దారుణమన్నారు.
Also Read : Ex Minister Appalaraju Shocking : ఎమ్మెల్యే శిరీష ఫ్యామిలీపై సీదిరి సీరియస్
















