Smriti Irani : ఢిల్లీ – ప్రముఖ నటి, మాజీ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలినని స్పష్టం చేశారు. గతకొంత కాలంగా తాను అంతగా యాక్టివ్ గా లేనని, నటనపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ఈ సందర్బంగా బుధవారం స్మృతీ ఇరానీ (Smriti Irani) ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. తనకు ముందు నుంచీ నటనతో పాటు పాలిటిక్స్ అంటే చచ్చేంత ఇష్టమని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Smriti Irani Comments
రాజకీయాలలో కొనసాగడం అనేది తన హాబీ అని పేర్కొన్నారు. ఇక నటన విషయానికి వస్తే అది కూడా కొనసాగుతూనే ఉంటుందని అన్నారు స్మృతీ ఇరానీ. కొందరు కావాలని తనను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని కానీ వారికి చెప్పేది ఒక్కటే తనకంటూ ఓ గోల్ ఉందని, దాని కోసం తాను ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
ఫుల్ టైమ్ పొలిటిషియన్ నని, పార్ట్ టైమ్ నటినని చెప్పారు స్మృతీ ఇరానీ. గత 25 సంవత్సరాల క్రితం తను నటించిన , పేరు పొందిన క్యుంకీ సాస్ భీ కభీ బహు థి తిరిగి ప్రసారం అవుతోంది. దీనిపై స్పందించారు. తన కెరీర్ లో మరిచి పోలేని జ్ఞాపకంగా మిగిలి పోతుందన్నారు స్మృతీ ఇరానీ. ఇందులో తను తులసి పాత్రలో నటించాను. ఈ పాత్రను ప్రేక్షకులు తమ ఇంట్లో ఒక వ్యక్తిగా భావించారని చెప్పారు. ఇదే సమయంలో తను తెలుగు వారికి కూడా సుపరిచురాలే. శంకర్ దర్శకత్వం వహించిన జై బోలో తెలంగాణలో తెలంగాణ తల్లి పాత్రలో నటించారు స్మృతీ ఇరానీ.
Also Read : Mynampally Rohit Shocking Comments : బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతం దుకాణం బంద్

















