HYDRA : హైదరాబాద్ – కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలోని హైడ్రా జూలు విదిల్చింది. నగరంపై ఫోకస్ పెట్టింది. ఆక్రమణదారుల గుంఎడల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తోంది. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను, చెరువులను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టింది. మంగళవారం హైదరగూడలో ఆక్రమణలను తొలగించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హైదరగూడలో ఆక్రమణలను హైడ్రా క్లీన్ చేసింది.
HYDRA Shocking to..
ప్రజల అవసరాలకు ఉద్దేశించిన 1094 గజాల స్థలాన్ని కబ్జాల చెర నుంచి హైడ్రా (HYDRA) విడిపించింది. ఏజీ ఆఫీసు కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు 2001లో నలందనగర్ కాలనీ పేరిట లేఔట్ వేశారు. అప్పట్లో హుడా అనుమతి పొందిన లే ఔట్ ఇది. ఇందుకోసం భూమిని అమ్మిన వారే పక్కన ఉన్న వాళ్ల సొంత భూమిలో భాగమని పేర్కొంటూ నలందనగర్ కు చెందిన 1004 గజాల స్థలాన్ని కబ్జా చేశారు. ప్రజల అవసరాలకు ఉద్దేశించిన తమ స్థలం కబ్జా అయ్యిందంటూ నలందనగర్ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేసారు.
విషయం పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్ పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులతో విచారణ జరిపించారు. హైడ్రా 1094 గజాల స్థలం నలందనగర్ కు చెందినదిగా గుర్తించింది. దీంతో అక్కడ ఉన్న ప్రహరీని, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డు ను తొలగించింది. ఈ క్రమంలో ఆక్రమణకు పాల్పడినవారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకు దిగారు. రాజేంద్ర నగర్ పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. పార్కు తో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలం తమకు దక్కిందని నలందనగర్ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : AP Whip Anuradha Fired : ప్రసన్న కుమార్ రెడ్డికి మతి భ్రమించింది
















