ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారికంగా భారత జట్టులో ప్రస్తుతం ఆడుతున్న, ఆడబోయే క్రికెటర్ల కాంట్రాక్టుకు సంబంధించి వివరాలు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు బీసీసీఐ ఉపాధ్యక్షుడు , కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా. బీసీసీఐ కాంట్రాక్ట్ లో ఆయా క్రికెటర్లు ఏడాదిలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శుక్లా మీడియాతో మాట్లాడారు. మొత్తం మూడు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు. ఇందులో ఏ – కేటగిరి కింద శుభ్ మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారని చెప్పారు.
బి – కేటగిరిలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ , మహమ్మద్ సిరాజ్ , రిషబ్ పంత్ , కుల్దీప్ యాదవ్, యశస్వి జైశ్వాల్ , శ్రేయాస్ అయ్యర్ ను చేర్చామని చెప్పారు. ఇక పూర్ పర్ ఫార్మెన్స్ కారణంగా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను సి – కేటగిరిలోకి మార్చామని తెలిపారు రాజీవ్ శుక్లా. సి – కేటగిరీలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, సంజూ శాంసన్, అర్ష్ దీప్ సింగ్, ప్రసిద్ద కృష్‌ణ, ఆకాష్ దీప్ , ధ్రువ్ జురేల్ , హర్షిత్ రాణా, వరుణ్ , నితీష్ రాణా, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్ , బిష్ణోయ్, రుతురాజ్ ఉన్నారని తెలిపారు రాజీవ్ శుక్లా.


















