ముంబై : భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను ఎక్కువగా ఇష్టపడే ఆటగాళ్లలో కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ఒకడు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు శాంసన్. తను స్వదేశంలో కీవీస్ తో జరిగిన టి20 సీరీస్ లో 4 మ్యాచ్ లు ఆడాడు ఇప్పటి వరకు. ఇందులో 10, 6, 0, 24 రన్స్ చేశాడు. ఒక రకంగా ఎవరూ తను ఇంత దారుణంగా ఆడుతాడని అనుకోలేదు. స్టార్ ఓపెనర్ గా గతంలో బంగ్లాదేశ్ తో దుమ్ము రేపిన సంజూ శాంసన్ ఇలా ఉన్నట్టుండి పేలవమైన ఫామ్ ను కొనసాగించడాన్ని తన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ తరుణంలో మాజీ క్రికెటర్లు సైతం తనకు మద్దతు ఇస్తున్నారు. తాజాగా తనను అమితంగా ఇష్టపడే ఒకప్పటి రాజస్థాన్ రాయల్స్ జట్టు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ స్పందించాడు.
సంజు శాంసన్ చాలా సంవత్సరాలుగా ఆడుతున్నాడు. అతను ఐపీఎల్‌లో మిడిల్ ఆర్డర్‌లో ప్రారంభించి, ఆ తర్వాత ఓపెనర్‌గా మారాడు. 10-12 సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తర్వాత, ఒత్తిడి అనేది ఒక సాకు కాకూడదన్నాడు. ఈ సిరీస్‌లో అతనికి నాలుగు అవకాశాలు వచ్చాయి. ఒకటి లేదా రెండు మ్యాచ్‌లలో వైఫల్యాన్ని నేను అంగీకరించగలను, కానీ మూడు లేదా నాలుగు మ్యాచ్‌లలో కాదన్నాడు. బ్యాకప్‌గా ఉండి, మూడో నంబర్‌లో బాగా బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ లాంటి ఆటగాడు వేచి ఉన్నాడని అతనికి తెలుసు. సంజు తనను తాను నిందించుకుంటాడు. అతనికి నాలుగు అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేక పోవడం తనను విస్మయానికి గురి చేసిందన్నాడు. ఏది ఏమైనా ఒక్క మ్యాచ్ చాలు తను తిరిగి పుంజు కోవడానికి అని అన్నాడు.



















