Boney Kapoor : ముంబై – ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సంతోషకరమైన వార్తను అన్షులా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు, న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లోని ఐకానిక్ బెల్వెడెరే కోటలో ఒక్కటయ్యారు.
2022లో డేటింగ్ యాప్‌లో కలుసుకున్నామని, ఆనాటి నుంచి తాము ఎన్నో కలలు కన్నామని, చివరకు తమ బంధం ఎంగేజ్మెంట్ దాకా వచ్చిందన్నారు.
Boney Kapoor’s Daughter Anshula Kapoor
ఈ సందర్బంగా అన్షులా కపూర్ కీలక వ్యాఖ్యలు చేసింది. తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఈ విధంగా రాసింది. నేను ఎప్పుడూ అద్భుతమైన కథలను నమ్మే సాధారణ అమ్మాయిని కానే కాదంటూ పేర్కొంది. కానీ నేను ప్రేమించిన అబ్బాయి రోహన్ టక్కర్ మాత్రం అద్భుతమైన వ్యక్తి. నా ఆలోచనలు, ఆశయాలకు దగ్గరగా ఉన్నాడు. అంతకు మించి నన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయడం తనను మరింత ఆనందానికి గురి చేసిందని తెలిపింది అన్షులా కపూర్.
విచిత్రం ఏమిటంటే నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) ఫ్యామిలీ మొత్తం పేరు పొందిన సినీ రంగానికి చెందింది. ఇక అన్షులా కపూర్ గత మూడేళ్లుగా రోహన్ టక్కర్ తో డేటింగ్ చేసింది. చివరకు తనతోనే బంధం సాఫీగా సాగుతుందని తలచింది. ఇదిలా ఉండగా ఆన్షులా కపూర్ ప్రేమించిన ప్రియుడు, కాబోయే భర్త రోహన్ టక్కర్ వృత్తి రీత్యా స్క్రీన్ రైటర్. వీరు ఒక్కటి కావడం పట్ల కపూర్ ఫ్యామిలీ మొత్తం ఫుల్ ఖుషీ అవుతోంది. జీవితంలో మరిచి పోని జ్ఞాపకం ఏదైనా ఉందంటే అది వివాహమేనని పేర్కొన్నారు బోనీ కపూర్.
Also Read : HYDRA Sensational : హైడ్రా సహకారంతో అడ్డు గోడను కూల్చేశారు



















