కరీంనగర్ జిల్లా : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కీలకమైన హుస్నాబాద్ ను బలవంతంగా ఆనాడు సిద్దిపేట జిల్లాలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదని చెప్పినా వినిపించు కోలేదన్నారు. ఆ ప్రాంత వాసులంతా కరీంనగర్ జిల్లాలో ఉండాలని కోరుతున్నారని, ఇది తాము అధికారంలోకి వచ్చాక చేస్తామని ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో త్వరలోనే ఆ కల నెరవేర బోతోందన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్.
అంతే కాకుండా ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ హోదాలో అంబేద్కర్ సర్కిల్ లో హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామని ప్రకటించారని మరోసారి గుర్తు చేశారు. స్థానిక శాసన సభ్యుడిగా ఉన్న తాను ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు పోయామని చెప్పారు పొన్నం ప్రభాకర్ గౌడ్. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు , జిల్లాల సైంటిఫిక్ మెథడ్ లో మార్పులు చేర్పులు జరిగితే ఈ ప్రాంతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కరీంనగర్ లో కలపడం తధ్యం అని స్పష్టం చేశారు . తమ స్వయోజనాల కోసం జిల్లాలను విభజించారని, తమ ఇష్టానుసారం ఆయా ప్రాంతాలను వద్దన్నా కలిపారని ఆరోపించారు. దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పొన్నం ప్రబాకర్ గౌడ్.















