హైదరాబాద్ : వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఆలయాల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు టీటీడీ స్థానిక సలహా కమిటీల (ఎల్‌ఏసీ) అధ్యక్షుడు నెమూరి శంకర్ గౌడ్ . ఆదివారం ఆయన ఏఈవో రమేష్ తో కలిసి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయబడతాయని తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నందున, పార్కింగ్ నిర్వహణ, క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యాలు, అన్నప్రసాద ఏర్పాట్లను పటిష్టం చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రశాంతమైన వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం అధికారులు , భద్రతా సిబ్బందికి సహకరించాలని, ట్రాఫిక్ భద్రతా మార్గదర్శకాలను పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు నేమూరి శంకర్ గౌడ్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు సులభంగా దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) తన హైదరాబాద్‌లోని ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. హిమాయత్‌నగర్ , జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాజీ ఆలయాలలో వైకుంఠ ద్వారం తెరిచి ఉంచడం జరుగుతుందన్నారు, ఇక్కడ భక్తులు తెల్లవారుజాము నుండే ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వ దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.



















