తిరుమల : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భగవత్ తో పాటు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ లు తిరుమలను సందర్శించారు. వీరికి సాదర స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ , అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మంతో పాటు టీటీడీ బోర్డు సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహా ద్వారం వద్ద ఈవో ఏకే సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారికంగా గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ప్రస్తుతం భారీ ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు శ్రీవారి భక్తులు. స్వామి వారిని కోరుకుంటే కోర్కెలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం, విశ్వాసం కూడా. ఈ సందర్భంగా టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉండగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ , కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ లకు ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు తిరుమల పుణ్యక్షేత్రంలో. మూలమూర్తి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శేష వస్త్రం కప్పి, స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, 2026 క్యాలెండర్, డైరీను అందజేశారు. ఈ సందర్బంగా ఆర్ఎస్ఎస్ బాస్ మోహన్ భగవత్ మీడియాతో మాట్లాడారు. కలియుగ దైవంగా గుర్తింపు పొందిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవడం సంతోషంగా ఉందన్నారు. భారత దేశం సకల సంపదలతో తల తూగాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.



















