బెంగళూరు : ఈ ఏడాది ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలం 2026లో ఊహించని రీతిలో వెంకటేష్ అయ్యర్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది. తన కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడినా చివరకు రూ. 7 కోట్లు వెచ్చించింది తన కోసం. ఇతర ఫ్రాంచైజీలను విస్తు పోయేలా చేసింది. రజిత్ పాటిదార్ ప్రస్తుతం ఆర్సీబీకి స్కిప్పర్ గా ఉన్నాడు. తను ఆల్ రౌండర్ గా పనికొస్తాడని ఆశించింది యాజమాన్యం.
ఇక బ్యాటింగ్ పరంగా చూస్తే టాప్ ప్లేయర్స్ ఉన్నారు ఆర్సీబీకి. విరాట్ కోహ్లీ, సాల్ట్ , దేవదత్ పడిక్కల్ , రజిత్ పాటిదార్ లాంటి వాళ్లు ఉన్నారు. ఇదే క్రమంలో బౌలింగ్ పరంగా చూస్తే భువనేశ్వర్ కుమార్, హాజిల్ వుడ్ సీనియర్ల జోడితో మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ఇక అయ్యర్ ఆల్ రౌండర్ గా పనికొస్తాడని ఆలోచించింది. ఈ వేలం పాటలో వెంకటేశ్ అయ్యర్ ను తీసుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ , కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ పెద్ద ఎత్తున పోటీ పడ్డాయి. కానీ చివరకు భారీ ధరకు చేజిక్కించుకుంది ఆర్సీబీ.
వేలంపాటలో అయ్యర్ కోసం రూ. 7 కోట్లు పెట్టిన ఆర్సీబీ మిగతా ప్లేయర్లను కూడా కొనుగోలు చేసింది. వారిలో మంగేష్ యాదవ్ ను రూ. 5.2 కోట్లు, జాకబ్ డఫీని రూ. 2 కోట్లకు, కాక్స్ ను రూ. 75 లక్షలకు, సాత్విక్ దెవస్వాల్ ను రూ. 30 లక్షలకు, విక్కో ఓస్త్వాల్ ను రూ. 30 లక్షలకు, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్ లను కూడా రూ. 30 లక్షలకు తీసుకుంది ఆర్సీబీ.



















